సమగ్ర సర్వే ఆశాస్త్రీయం,అనుమానాస్పదం
బీసీ జాక్ స్టేట్ ఛైర్మెన్ డా.శేషు
వరంగల్, అక్షిత బ్యూరో:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రిపోర్టు ఆశాస్త్రీయంగా ఉంది కాబట్టి సర్వే రిపోర్ట్ ని వ్యతిరేకిస్తున్నామని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరుణహరి శేషు తెలియజేశారు. సర్వే రిపోర్ట్ కి వ్యతిరేకంగా కేయూ దూర విద్యా కేంద్రంలోని పూలే విగ్రహాల వద్ద నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ కులగణన నివేదికలో బీసీలను 46 శాతం తక్కువ చేసి చూపించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేసినారు. 2014లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లో 51 శాతం ఉన్న బీసీ జనాభా 46 శాతానికి ఎలా తగ్గిపోయిందని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ జనాభా 3.51 కోట్లుగా ఉంటే పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర జనాభా 3.54 కోట్లుగా ఎలా ఉంటుంది. 18 అగ్రకులాల జనాభా 15.79 శాతం గా ఉంటే 134 కులాల బీసీ జనాభా 46 శాతమే ఎలా ఉంటుంది. బీసీలకు నష్టం చేస్తూ అశాస్త్రీయంగా ఉన్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని వ్యతిరేకిస్తున్నామని తెలియజేసినారు. కార్యక్రమంలో బిసి నాయకులు దారబోయిన సతీష్ వినయ్ చారి డాక్టర్ పాలడుగుల సురేందర్ వేణు చారి డాక్టర్ రమేష్ బంక రాకేష్ బండి డేనియల్ తదితరులు పాల్గొన్నారు.