ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి
ఇద్దరు నామినేషన్ దాఖలు
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా మూడవ రోజైన బుధవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు .హనుమకొండ జిల్లా, ధర్మసాగర్ మండలానికి చెందిన బంకరాజు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ ను,ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో సెట్ నామినేషన్ ను దాఖలు చేసినట్లు ఆమె తెలిపారు. నల్గొండకు చెందిన పన్నాల గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు.
నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అదనపు కలెక్టర్ మరియు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జే. శ్రీనివాస్ ఉన్నారు.