సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రీసర్వే

చట్టపరిధిలోబడి సహజ న్యాయసూత్రాలకు

అనుగుణంగా రీసర్వే

సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జయలక్ష్మి

విజయవంతగా రీసర్వే డిప్యూటీ తాహసీల్దార్ ల రాష్ట్ర స్దాయి శిక్షణ, సమీక్ష సదస్సు
విజయవాడ, అక్షిత ప్రతినిధి :

చట్టపరిధికి లోబడి సహజ న్యాయ సూత్రాలను అన్వయిస్తూ రీసర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయలక్ష్మి స్పష్టం చేసారు. గతంలో జరిగిన తప్పిదాలను అధికమిస్తూ సజావుగా రీసర్వే వ్యవహారాలను పూర్తి చేయాలని సూచించారు. బుధవారం గుంటూరు నాగార్జునా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్దాయి రీసర్వే డిప్యూటీ తాహసీల్దార్ శిక్షణ, సమీక్ష కార్యక్రమానికి సిసిఎల్ఎ ఛీప్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ రీసర్వే డిటిలకు విస్త్రత అధికారాలు కల్పించటం జరిగిందని వాటిని సమస్యల పరిష్కారానికి వినియోగించాలన్నారు. కొందరు చేసిన తప్పిదాల వల్ల రెవిన్యూ రికార్డులలో నెలకొన్న లోపాలను అధికమించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా స్పష్టమైన రికార్డుల రూపకల్పనకు మార్గం సుగమం చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు రీసర్వే ప్రాజెక్టు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, వాస్తవ పరిస్ధితులకు అనుగుణంగా పనులు పూర్తి చేసి హక్కు దారుల మన్ననలలు పొందాలన్నారు. అధికారులు తమ పరిజ్ణానాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలని, తాము ఇచ్చే ఉత్తర్వులలో స్పష్టత ఉండాలని అదేశించారు. తప్పులు చేసే వారిని ఉపేక్షించబోమని, కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.

సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల సంచాలకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కీలకోపన్యాసం చేస్తూ రీసర్వే అధికారులు ప్రజలకు జవాబుదారిగా, రైతుల సంతృప్తే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న చట్టాలను అయా సమస్యల వారిగా అన్వయింపచేసుకుని న్యాయమైన ఉత్తర్వులు వెలువరించాలన్నారు. ప్రస్తుతం రీసర్వేకు తగిన సమయం ఇచ్చినందున ఎట్టి పరిస్ధితులోనూ తప్పులకు అవకాశం ఉండకూడదన్నారు. రెవిన్యూ సదస్సులలో 2,80,000 ఫిర్యాధులు వచ్చాయని, యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేసి భవిష్యత్తులో ఈ సమస్యలు ఎదురు కాకుండా చూడాలన్నారు. క్షేత్ర స్దాయిలో ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని, వాటి పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణకు కూడా వెనుకాడబోమని అన్నారు. సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల అదనపు సంచాలకులు గోవిందరావు మాట్లాడుతూ బ్రిటీష్ కాలం తరువాత అధునిక పరిజ్ణానం వినియోగించి చేస్తున్న రీసర్వే విజయవంతం కావాలంటే ప్రతి ఒక్క అధికారి సమస్యలను లోతుగా అవగాహాన చేసుకుని పరిష్కారం చూపాలని కోరారు. అందుబాటులో ఉన్న చట్టాలను అవగాహన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రీసర్వే డిప్యూటీ తాహసీల్దార్ లు దాదాపు 550 మంది సదస్సుకు హాజరయ్యారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, కేంద్ర కార్యాలయం ఉప సంచాలకులు డిఎల్ బిఎల్ కుమార్, ప్రాంతీయ సంయిక్త సంచాలకులు కెజియా కుమారి, సహాయ సంచాలకులు ఎంవి రంగప్రసాద్, ప్రశాంతి, ఎవిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking