డప్పులు బహుకరణ
ఎమ్మార్పీఎస్ నాయకులకు అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
ఈనెల 7న జరిగే లక్ష డప్పులు-వేలగొంతులు కార్యక్రమంలో భాగంగా ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి మండలానికి చెందిన మునిపంపుల,పల్లివాడ, ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ నాయకులు డప్పులు కొరకై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డిని సంప్రదించారు. వెంటనే ఆయన స్పందించి 25 వేల రూపాయల విలువగల 30 డప్పులను మునిపంపుల,పల్లివాడ ఎమ్మార్పీఎస్ నాయకులకు తన తండ్రి గంగుల నరసింహారెడ్డి చేతుల మీదుగా బహుకరించారు. అనంతరం వారు గంగుల వెంకట్ రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.