అందరివాడు…చెరుకూరి

అందరివాడు…చెరుకూరి

విజయం… యూనిటీదే

ఆకాంక్షలకు ప్రతిరూపం..క”మ్యూనిటీ

వార్ వన్ సైడే

నాగోల్, అక్షిత ప్రతినిధి :

ఆకాంక్షలకు ప్రతిరూపం.. అందరిని కలుపుకు పోయేతత్వం. కమ్యూనిటీతో మమేకమయ్యే వ్యక్తిత్వం. నీతి నిబద్ధత అతని సొంతం. వినయం… విధేయత…విలక్షణమైన వ్యక్తిత్వం. సౌమ్యుడు… శాంత స్వభావశీలి. ఎంతటి సమస్యనైనా అవలీలగా అర్థం చేసుకొని… అందరి సమన్వయంతో పరిష్కరించే ధీశాలి. నికార్సయిన నిబద్ధతతో ప్రజలకు విశిష్ట సేవలందించడంలో అందేవేసిన చెయ్యి…సహభావన టౌన్ షిఫ్ ఎమరాల్డ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా యూనిటీ ప్యానల్ నుంచి బరిలో నిలిచిన చెరుకూరి శ్రీనివాస్. యూనిటీ ప్యానల్ విజయంతోనే సి బ్లాక్ సమస్యల సాధనకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుత అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నేత కావలి వెంకటేష్, ఆంజనేయులు తదితరుల నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి ఆయా సమస్యల సాధనకు విశిష్ట కృషి చేస్తుండ్రు.

టౌన్ షిప్ లో మౌళిక సదుపాయాల కల్పనకు యూనిటీ ప్యానల్ కృషి విశిష్టం. అధ్యక్షులుగా చెరుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బాణాల సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శిగా అబిద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీగా వి. రాజ శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గణేశ్వరపు రేవంత్ బాబు, అసిస్టెంట్ కోశాధికారిగా తప్పెట నాగరాజులను ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యూనిటీ ప్యానల్ నేతలు కోరుతున్నారు.

విజయదరహాసం

సమస్యల సాధనకు “సమిష్టి” కృషి

యూనిటీ ప్యానల్ భారీ ర్యాలీ

కావలి వెంకటేష్

ఈనెల 18 న జరుగనున్న సహభావన టౌన్ షిఫ్ ఎమరాల్డ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూనిటీ ప్యానల్ విజయాన్ని కాంక్షిస్తూ భారీ ర్యాలీ జరిగింది.

యూనిటీ ప్యానల్ నుంచి అధ్యక్షులుగా చెరుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బాణాల సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శిగా అబిద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీగా వి. రాజ శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గణేశ్వరపు రేవంత్ బాబు, అసిస్టెంట్ కోశాధికారిగా తప్పెట నాగరాజులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యూనిటీ ప్యానల్ సీనియర్ నేతలు కావలి వెంకటేష్, వి. శ్రీనివాసరావు, ఆంజనేయులు, వెంకట్ తదితరులు కోరారు. ఇంటింటా తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ప్రగతికి పట్టం కట్టండి… సమస్యల సాధనకు చాలా కృషి చేశాం… ఇంకా చేయాల్సి ఉంది. మిగిలిన సమస్యలను పరిష్కరించుకునేందుకు యూనిటీ (సమిష్టి)గా కృషి చేద్దామంటూ నినదించారు. యూనిటీ ప్యానల్ దే విజయమంటూ విజయ దరహాసం ప్రదర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking