కేటిఆర్ రీకాల్ కాదు.. కాంగ్రెస్ సర్కారు రీఎలక్ట్

కేటిఆర్ రీకాల్ కాదు..
   కాంగ్రెస్ సర్కారు రీఎలక్ట్

*రాజకీయాల్లో పరుష పదజాలానికి బ్రాండ్ అంబాసిడర్లు

*రూ.42వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఎగ్గొట్టిండ్రు

*రూ.7 లక్షల కోట్ల
అప్పు వదిలేసిపోయిండ్రు

అందిన కాడికి
అమ్ముకుని పరారయిర్రు

బీఆర్ఎస్ దోచుకున్న
డబ్బు రికవరీ చేయ్యాలి

ఒక్క లేఖ రాస్తే
అసెంబ్లీలో చర్చ
పెట్టించే బాధ్యత నాది..

చర్చించుకుందాం..
నిజాలు చెబుదాం

నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి

మిర్యాలగూడ జూలై 17 అక్షిత ప్రతినిధి :

మిత్రమా కేటీఆర్ ఫ్రస్టేషన్ లోపల పెట్టుకో.. ప్రజల మీద చూపెడితే సహించబోరని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన కార్యాలయం నుండి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అహంకారపూరిత మాటలపై సర్వే చేయించుకో ప్రజల్లో ఎంత చులకనయ్యారో తేలుతుందన్నారు. రాజకీయాల్లో పరుష పదజాలానికి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారని , లీడర్లు కావాలనుకునేటోళ్లకు బూతులు, పిచ్చి వాగుడును ట్రెండ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ రీకాల్ పెట్టడం కాదు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ మళ్లీ రీఎలక్ట్ అవుతుందని, ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ పాలన సాగిస్తుందని గుర్తు చేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తూ గురుకులాలకు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారని, మీరు దిగిపోయే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రూ.42 వేల కోట్ల పెండింగ్ బిల్లులు వదిలేసిపోయారని, అందినకాడికి అమ్ముకుని పరారైన సంగతి మర్చిపోయారా? అని నిలదిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా మెతకగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా బీఆర్ఎస్ దొంగలు దోచుకున్న డబ్బును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ లీడర్లు దోచుకుని తిన్నారని మాటిమాటీకి అనడం కంటే బీఆర్ఎస్ దోచుకుని తిన్న లెక్కలు ప్రజల ముందు పెడితేనే నిజానిజాలు ఎంటో తెలుస్తాయని వివరించారు.
ఫామ్‌హౌస్‌లో చర్చకైనా రెడీ …బీఆర్ఎస్ లీడర్లు ఒకరేమో ప్రెస్‌క్లబ్ అంటరు ఇంకొకరు మేడిగడ్డ కాడ మరొకరు నాగార్జునసాగర్ సందులళ్ల, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద అంటూ గప్పాలు కొడుతున్నారని ఎంపీ రఘువీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి టైమ్ వేస్ట్ ముచ్చట్ల కంటే నిజంగా చర్చకు రావాలంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షం నుంచి ఒక్క లేఖ రాయండని సూచించారు. శాసనసభలో చర్చ పెట్టించే బాధ్యత నేనే తీసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే మేమే ఫామ్‌హౌస్‌కు వచ్చి అక్కడే మీడియా సమక్షంలో చర్చించి తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నాయకులు దొంగలెక్క దిక్కుకొకడు పోయి వస్తవా..? రావా.. అంటూ సవాల్ విసరడం సిగ్గు చేటని, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు సవాళ్లు ఎందుకని ప్రశ్నించారు. దేశంలో అత్యధికంగా ఇరిగేషన్ సాగు సాగర్‌లోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రఘువీర్ రెడ్డి చెప్పారు. 40 ఏండ్లు నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జానారెడ్డి ఏం చేశారంటూ అడిగారని, ఒకసారి జానారెడ్డి ఏం చేశారో పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. దేశంలోనే అత్యధికంగా నీటిపారుదల ప్రాజెక్టుల కింద సాగవుతున్న భూమి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే అత్యధికమని తేల్చిచెప్పారు. పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలనీ మీ మాటలకు ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేస్తు జగదీష్ రెడ్డికి సవాల్ విసురు తున్నామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నియోజకవర్గాల వారీగా లెక్కలు తేలుద్దాం రండి చర్చ పెట్టి ప్రజలకు నిజాలు చెబుదామని పిలుపునిచ్చారు. కాళేశ్వరం కూలిపోయింది నిజం కాదా? యావత్ తెలంగాణ ప్రజలు చూసింది నిజం కాదా? మళ్లీ బీఆర్ఎస్ నీళ్లు నింపండి అంటూ కొత్త రాగం అందుకుందన్నారు. నీళ్లు నింపితే ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోతుందని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని, ఏకంగా 45 గ్రామాలు ప్రాజెక్టు నీటికి నామరూపాల్లేకుండా కొట్టుకుపోతాయని చెప్పారని గుర్తు చేశారు. ఇది ఫాస్ట్ యుగమని, ప్రజలకు జరిగేవన్నీ తెలుసని, చేసిన పాపం పనులను సైతం ధైర్యంగా చెప్పుకోవడం మీకే చెల్లుబాట వుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీకిందేమీ లేదని, ఎంపీ ఎన్నికల్లో జీరోనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.బేసిన్ ల్లేవ్ బేషజాలు లేవన్నది కేసీఆర్ కాదా?గతంలో బేసిన్ ల్లేవ్ బేషజాల్లేవ్ రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పింది కేసీఆర్ కాదా? అని రఘువీర్ రెడ్డి నిలదీశారు. 3వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని, తీసుకెళ్లండని చంద్రబాబుకు చెబితేనే బనకచర్ల ప్రాజెక్టు మొదలుపెట్టారని క్లారిటీ ఇచ్చారు. మాట మార్చడంలో బీఆర్ఎస్ లీడర్లకు కనీసం సిగ్గు అన్పించడం లేదా? అంటూ చురకలు అంటించారు. జగదీష్ రెడ్డి కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వల్లే 2వేల ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. జగదీష్ రెడ్డి మూడుసార్లు గెలిచినా 30 శాతం ఓట్లు దాటలేదని, మీరు గెలిచేందుకు కేసీఆర్ కారణం కాదన్నారు. సంకినేని వెంకటేశ్వరరావు పోటీ చేసిన ప్రతిసారి 30 వేల నుంచి 40 వేల ఓట్లు పట్టుకుపోవడం వల్లే జగదీష్ రెడ్డి గెలిచారని, సంకినేని ఫొటో ఇంట్లో పెట్టుకోవాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 50వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్కసీటు బిఆర్ఎస్ కు రాదన్నారు. ఇప్పటికైనా భాష వ్యవహారం మార్చుకోవాలని హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking