అమోఘమైన రుచికి కేరాఫ్
ఇలియాజ్ బిర్యాని పాయింట్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నోరూరించే అమోఘమైన రుచికి హాఫిజ్ మొహమ్మద్ ఇలియాజ్ బిర్యాని పాయింట్ భేష్ అని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ పేర్కొన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో సీతారాంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాఫిజ్ మొహమ్మద్ ఇలియాజ్ బిర్యాని పాయింట్ ను నిర్వాహకుల అభ్యర్థన మేరకు హమీద్ షేక్ సందర్శించారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఘుమఘుమలాడే బిర్యాని అందిస్తున్న హాఫిజ్ మొహమ్మద్ ఇలియాజ్ ను ఈసందర్భంగా ఆయన అభినందించారు. ప్రస్తుతానికి టెక్ అవే పాయింట్ ను నిర్వహిస్తున్నట్టు, త్వరలో డైనింగ్ ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హమీద్ షేక్ మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలో బైపాస్ రోడ్డులోని ఖలీల్ భాయ్ ధాబా, హౌసింగ్ బోర్డు కాలనీలోని విట్రాస్ గ్రాండ్ రెస్టారెంట్ లో అమోఘమైన బిర్యాని లభిస్తున్నదని అభిప్రాయపడ్డారు. హాఫిజ్ మొహమ్మద్ ఇలియాజ్ బిర్యాని పాయింట్ ను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.