ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం…!

ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం…!

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్…!!

జనగామ, అక్షత ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి… ఆర్టీసీని బలోపేతం చేయడమే కాక… నమ్మకాన్ని పెంచినట్లు అయిందని… జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.బుధవారం జనగామ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంతో… విజయవంతంగా ఆర్టీసీ సంస్థ ప్రగతి బాటలో పయనిస్తున్నందున వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ…ఒక్క జనగామ డిపోలో… 2.26 కోట్ల మహిళలు ప్రయాణించి… 108.96 కోట్లు ఆర్టీసీ ప్రగతి సాధించినట్లు తెలియజేశారు.ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని… మహిళలు ఎక్కని బస్సు లేదన్నారు.

బస్సుల ద్వారా ఆదాయం సమకూరడంతో మహిళా సంఘాలు బస్ లను కొనుగోలు చేసి తద్వారా లబ్ధి పొందడమే కాక ఆ బస్సులకు యజమానులుగా మారారన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు సాధికారిత దిశగా కొనసాగటం ఇది ఒక తార్కాణంగా పేర్కొన్నారు.ఏ ఎస్ పి పండేరి చేతన్ నితిన్ మాట్లాడుతూ… ఆర్టీసీ సంస్థ లాభాల బాటల పయనించడం సంతోషకరంగా ఉందన్నారు. అందుకు మహాలక్ష్మి పథకమే కారణంగా తెలియజేశారు.

బస్టాండ్ లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ వస్తువులను జాగ్రత్తపరుచుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రయాణికులకు మరింత భద్రత కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ స్వాతి ఆర్టీసీ ప్రగతిని తెలియజేస్తూ ఒకప్పుడు 36 వేల మంది ప్రయాణించే ఈ ప్రాంతం 56 వేల మంది ప్రయాణికులతో 66% మహిళలతోనే ప్రయాణాలు కొనసాగుతున్నట్లు వివరించారు. 97 ఆర్టీసీ డిపోలకు సంబంధించిన 341 బస్ స్టేషన్లలో ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు తెలియజేశారు. ఆర్టీసీ సంస్థ ప్రగతి బాటలో పరుగులు పెడుతున్నదని అందుకు ఆర్టీసీ ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఆర్థికంగా లబ్ధి పొందుతున్న మహిళ ఉద్యోగులు మండల విద్యాశాఖ అధికారి కళావతి ఉపాధ్యాయురాలు స్వరూపలు స్పందిస్తూ జనగామ ప్రాంతం జన సాంద్రత గల ప్రాంతమని ఆర్టీసీ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడంలో విజయవంతం సాధించిందన్నారు.ప్రతి నెల ఆర్థిక భారం తగ్గడంతో కుటుంబాలు ఆనందంగా ఉన్నాయన్నారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వలన ప్రగతి బాటలో దూసుకుపోతుండడం తో ఏర్పాటు చేసిన పోటీలలో పలువురు విద్యార్థులు పాల్గొని వ్యాసరచన పోటీలలో గెలుపొందగా జిల్లా కలెక్టర్ శాలువాల తో సన్మానించి ప్రత్యేక బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి పండేరి నితిన్ చేతన్, డిఆర్డిఓ అదనపు పిడి నూరుద్దీన్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మమత ఆర్టీసీ అధికారులు సిబ్బంది ఉచిత మహిళ ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking