రాజిరెడ్డి హత్య కేసును ఎంతో చాకచక్యంగా చేదించిన పోలీసులు…!

రాజిరెడ్డి హత్య కేసును ఎంతో చాకచక్యంగా చేదించిన పోలీసులు…!

నర్మెట సీఐ అబ్బయ్యను, ఎస్సై, పోలీసులను అభినందించిన…!!

జనగామ ఏసిపి పండరి నితిన్ చేతన్…!!!

జనగామ/ బచ్చన్నపేట, అక్షిత ప్రతినిధి:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఈ నెల 17న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు… దర్యాప్తు ముమ్మరం చేసి… నాలుగు రోజుల పాటు పోలీసులు వివిధ రకాల సామాజిక మాధ్యమాలతో…సిసి ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో జనగామ ఎసిపి పండరి నితిన్ చేతన్, నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్.కె హమీద్ లతో కలిసి వివరాలను వెల్లడించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో… ఉమా సాగర్ కు చెందిన పునుగుల బండి వ్యాపారం నడుస్తున్న సమయంలో వాళ్ళ అమ్మ ని చూసుకుంటూ హత్యకు గురైన మతిస్థిమితం లేని వ్యక్తి రాజిరెడ్డి తరచూ తిట్టేవాడని, ఏలాగైనా అతన్ని హతమార్చాలని ఉద్దేశంతో నిందితుడు మరొక వ్యక్తి… కోరుబోతుల అరుణ్ తో ప్రణాళికా రూపొందించుకున్నారు. వీరికి మరొక ఇద్దరు వ్యక్తులు కోయబోతుల రాజు, తంగిళ్ళపల్లి విజయ్ లు సహకరించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన సిమెంట్ ఇటుక, పోలీసులకు చిక్కకుండా ఓ చెరువులో వేశారు. ఆ సమయంలో ధరించిన దుస్తులను మంటలో కాల్చిన అనవాళ్లతో పాటు నిందితుల వద్ద ఒక స్కూటీ ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నలుగురి నిందితులను అదుపులోకి తీసుకొని… కోర్ట్ లో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ హత్య కేసులో ఎంతో చురుకుగా..చాకచక్యంగా… వ్యవహరించిన…. నర్మెట సీఐ అబ్బయ్య స్థానిక ఎస్సై ఎస్.కె హమీద్ పోలీస్ సిబ్బందిని జనగామ ఏసిపి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking