రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీకి ఎంపికైన.. కేసిరెడ్డిపల్లి జడ్పి పాఠశాల విద్యార్థులు…
జనగామ, బచ్చన్నపేట, అక్షిత ప్రతినిధి:
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లి జడ్పీ పాఠశాలలో… చదువుకుంటున్న విద్యార్థులు సిహెచ్. అనిల్, సిహెచ్. శ్రీమన్నారాయణలకు…జిల్లా స్థాయిలో నిర్వహించిన బాక్సింగ్ పోటీలో… రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ తెలిపారు. ఈ నెల 25, 26, 27న రాష్ట్రస్థాయిలో బాక్సింగ్ పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటి ముజీబ్ పాల్గొన్నారు.