తవ్వి..వదిలేసారు..

తవ్వి..వదిలేసారు..

ప్రమాదకరంగా మారిన ఓపెన్ నాలా గుంత పై పట్టింపు లేదా..?

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం నెలలు గడుస్తున్న పట్టించుకునేది ఎవరు..?

కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అధికారుల వైఫల్యం..

మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరది గండి మైసమ్మ చౌరస్తా సంతోష్ దాబా పక్కన హెచ్ఎండిఏ ఓపెన్ నాలా కోసం తవ్వి వదిలేశారు. పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్న నేటికీ పూర్తి కాకపోవడంతో. కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి తవ్వి వదిలేయడంతో ఎప్పటికీ రద్దీగా ఉండే ప్రాంతం ఆ గుంతలో వర్షపు నీరు నిండి మామూలు చిన్న గుంత అనుకొని ఆ గుంతలో పడిన సంఘటనలు కూడా ఉన్నాయి నలుగురు ఐదుగురు పడి ఆస్పటల్ పాలైన విషయాలు కూడా అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ రద్దీగా ఉండే ప్రాంతాన్ని వెంటనే పనులు ప్రారంభించి సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు.

హెచ్ఎండి..ఏఈని…వివరణ కోరగా అక్షిత.ప్రతినిధి.. ఓపెన్ నలా.గురించి తవ్విన మాట వాస్తవమే కానీ కొద్దిగా పనులు లేట్ అయింది తొందరలోనే పనులు కంప్లీట్ గా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు.ఏది ఏమైనా అధికారులు స్పందించి రద్దీగా ఉండే ప్రాంతాన్ని పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking