జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనలు అమలు చేయండి: : వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద
వరంగల్, అక్షిత బ్యూరో: జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనలు అమలు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి లతో కలసి మునిసిపల్, కాలుష్య నియంత్రణ మండలి, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ హరిత గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) నిబంధనల ప్రకారం కోట చెరువును, శుభ్రం చేయించాలని, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణపై ఎన్జీటీ ఆదేశించిన విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ , బయో హజార్డ్ మేనేజ్మెంట్ లను ప్రాసెసింగ్ చేసి డాక్యుమెంట్ తయారు చేసి అందజేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న లెగసీ వ్యర్ధాలను టెండర్ ప్రాసెసింగ్ చేయాలని అన్నారు. ఎన్ జీ టి విధి విధానల ప్రకారం 17 ఏకరాల ల్యాండ్ ను రాంపూర్ డంప్ యార్డ్ లో నిర్వహించడం తో పాటు బయో మైనింగ్ పూర్తి చేయడం జరిగిందని, కొనుగోలు చేసిన ల్యాండ్ కు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని నియంత్రించడానికి ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని బల్దియా కమిషనర్ తెలిపారు.
హరిత గ్రీన్ ట్రిబ్యునల్:
(ఎన్జిటి) నిబంధనలను అమలు చేయాలని, పర్యావరణ పరిరక్షణ కోసం త్వరలో జరిగే వినాయక పండుగ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలని, అందుకోసం కాలుష్య నియంత్రణ మండలి, పురపాలికల, కార్పొరేషన్ తరపు నుండి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేయాలని, నగరంలోని కాలనీ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి కాలుష్యాన్ని అరికట్టడానికి మట్టి వినాయక విగ్రహాలను పూజించెల అవగాహన కలిగించాలని అన్నారు. పాఠశాల విద్యార్థులకు మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేసేలా శిక్షణ అందజేసి వాటిని కొనుగోలు చేసేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం లో డి ఆర్ ఓ విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ. సునీత, బల్దియా సి ఏం హెచ్ ఓ డా రాజారెడ్డి, ఇంచార్జి ఎస్ ఈ మహేందర్ ఏం హెచ్ ఓ డా.రాజేష్. నర్సంపేట, వర్ధన్నపేట మునిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.