తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి: తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో సమావేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు గంట లోపు ముర్రుపాలు పట్టించాలని అంగన్వాడి కేంద్ర సూపర్వైజర్ కే మంగమ్మ అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో ఆమె మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు గంట లోపు ముర్రుపాలు పట్టిస్తే ఆ తల్లి నుంచి వచ్చే పాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని పుట్టిన బిడ్డ ఆరోగ్యం గా ఉంటారని తెలిపారు. ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే బిడ్డకు ఇవ్వాలి ఆయా కార్యక్రమంలో ఐ సీ పి ఎస్ శోభ మండల అంగన్వాడి టీచర్లు భూషణ్మ్మ, సునీత, పుష్ప లత, తల్లులు పాల్గొన్నారు.