శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి: శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అసోసియేషన్ కు ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను ఆరెకపూడి గాంధీ శాలువా లతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ పాఠశాలలకు ట్రేడ్ లైసెన్స్ సహా ఇతర ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై సుదీర్ఘంగా గాంధీ తో చర్చించారు. సందర్భంగా గాంధీ మాట్లాడుతూ స్నేహపూర్వకంగా స్పందించి, నూతనంగా నియమితమైన అసోసియేషన్ కార్యవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు , అభినందనలు తెలియచేస్తున్నాననీ అన్నారు. నా దృష్టికి వచ్చిన మీ ప్రతి సమస్య పరిష్కారానికి నావంతు శాయశక్తులా కృషి చేస్తానని, మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు, నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు ఏ.ఆర్. పవన్ కుమార్, కార్యదర్శి పి. త్రిమూర్తులు, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అసోసియేషన్ నాయకులు పి. అనిల్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, గాయం భీష్మా రెడ్డి, బరుసు వెంకటేశ్వరరావు, బండా నరేంద్రబాబు, ఎన్.ఎస్. రావు, ఏ.బీ.ఎన్ శ్రీనివాసరావు శ్రీనివాస్ శంకర్, డి. విజయ్ కుమార్ , ఇతర సభ్యులు పాల్గొన్నారు.