- కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లు ఆమోదించాలి
- కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్
- డిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొన్న కాట
పటాన్‌చెరు, అక్షిత ప్రతినిధి: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజనర్సింహాతో కలిసి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ..బీసీల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు.బిసి బిల్లుపై పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.బీసీ బిల్లు విషయంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.బీసీ బిల్లును ఆమోదించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తదని కాట శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
