గ్రామాలలో ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికే పల్లెనిద్ర కార్యక్రమం- జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు
- గ్రామాలలో ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికే పల్లెనిద్ర కార్యక్రమం- జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, అక్షిత బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో దూది వెంకటాపురంలో బుధవారం పల్లె నిద్ర చేసిన జిల్లా కలెక్టర్ హనుమంత రావు పల్లె నిద్ర కార్యక్రమం లో భాగంగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రెవిన్యూ, హౌసింగ్, సివిల్ సప్లై, వైద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, శిశు సంక్షేమ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, పంచాయితీ, లీడ్ బ్యాంక్, మిషన్ భగీరథ, ఎక్సైజ్, వ్యవసాయ, పశు వైద్య, మత్స్యశాఖ, వివిధ శాఖ లు సాయంత్రం వేళ జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా అధికారులందరూ గ్రామంలోని ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ వారి సమస్య లను స్వయంగా అడిగి తెలుసుకున్నా రు. కొన్ని సమస్యలను ఇక్కడికి అక్కడే తీర్చడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్నా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును మహిళలతో కలెక్టర్ స్వయంగా మాట్లడారు. లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం వంటి పథకాలు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. అనర్హులేవరైనా మిగిలారా అని అరా తీశారు.ఈ సమావేశంలో దూది వెంకటాపురం గ్రామంలో గ్రామస్థులు వాళ్ల గ్రామంలో ఉన్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.గ్రామానికి ఉదయం , సాయంత్రం బస్ సౌకర్యం లేదు అని గ్రామస్థులు కోరడంతో వెంటనే గుట్ట డిపో డీఎం కి పోన్ చేసి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. గ్రామంలో పీర్ల కొట్టం వద్ద తుప్పు పట్టిన కరెంటు పోల్ తో వర్షం వచ్చినప్పుడు దారి వెంట వెళ్లే వారికి షాక్ కొడుతుంది అని తెలిపారు కరెంటు డిఈ వెంటనే ఆ సమస్య పరిశీలించి ఇనుప పోల్ మార్చి సిమెంటు పోల్ వేయాలి అని చెప్పారు. గ్రామంలో మొత్తం 24 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి అని కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు. గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని చెప్పడంతో మీ గ్రామానికి కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ కూడా మంజూరు అయింది. త్వరలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గ్రామంలో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు తెలుపడంతో పరిష్కరిస్తానని చెప్పారు.గ్రామంలో కొత్తగా 33 రేషన్ కార్డు లు వచ్చాయని,మొత్తంగా గ్రామస్థులు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేసామని తెలిపారు. ప్రైమరీ స్కూల్ లో వాష్ రూం సరిగా లేవు అని చెప్పడంతో కొత్త వాటిని నిర్మిస్తామని చెప్పారు. గ్రామానికి వెటర్నరీ సబ్ సెంటర్ లేక పశువులకి సంబంధించి రోగాలు వచ్చినప్పుడు చికిత్స కోసం దూరం వెళ్ళాలి గ్రామస్థులు తెలుపడంతో. కొత్త సబ్ సెంటర్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాను అని తెలిపారు. కొంతమంది బ్యాంకు మేనేజర్స్ ఇబ్బంది పెడుతున్నారు అని గ్రామస్తులు తెలుపగా సమస్య పరిష్కారిస్తామని తెలిపారు. గౌడ కులస్తులకి త్వరలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారితో కాటమయ్య కిట్స్ పంపిణీ చేయిస్తామని చెప్పారు. గ్రామ ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ , 10 లక్షవరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ , 500 రూపాయల కే గ్యాస్ సిలిండర్, రైతు రుణ మాఫీ ,రైతు భరోసా, సన్న బియ్యం ,కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ పట్ల ఆనందం వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజ, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా పంచాయతీ అధికారి సునంద, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
