నార్కట్ పల్లి, అక్షిత ప్రతినిధి: మండల పరిధిలోని ఏపీ లింగోటం సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణీస్తున్న స్కూటీ లో నుండి మంటలు చెలరేగాయి.ఇది గమనించిన వాహనదారుడు వెంటనే అప్రమత్తమై బండి దిగడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది.అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు పోలిసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
