బీసీ బిల్లును కేంద్రo ఆమోదించాలి – సిపిఎం ధర్నా

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: బీసీ బిల్లును వెంటనే అమలుకై కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపారని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించాలన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలన్నారు. ముస్లిం మైనార్టీలలో వెనుకబడి ఉన్న వారికే రిజర్వేషన్ అని ముస్లిం లకు కాదన్నారు. ముస్లిం సాకు చూపి బిల్లును వ్యతిరేకించడం సరైందికాదన్నారు. ముస్లిమ్ మైనారిటీలు కూడా చాలా వెనకబడి ఉన్నారని వారి అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో అన్ని పార్టీలు మద్దతు తెలపాలన్నారు. ప్రభుత్వాలు ద్వంద వైఖరి వీడి బిల్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.రవినాయక్, శశిధర్ రెడ్డి, వినోద్ నాయక్, అయూబ్, నాయకులు గాదె పద్మ, కోడిరెక్క మల్లయ్య, గోవర్ధన, పిల్లుట్ల సైదులు, ఊర్మిళ, కరిమున్నిసా, పాపిరెడ్డి, కరీం, నాగుల్ హుస్సేన్, వదూద్, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, ఉన్నాం వెంకటేశ్వర్లు, రామారావు, వజీర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking