విద్యుత్ పరికరాల చోరీ..దొంగతనాలను అరికట్టాలి – మట్టిమనిషి వేనేపల్లి

  • విద్యుత్ పరికరాల చోరీ 
  • రైతులకు తీవ్ర కష్టాలు 
  • దొంగతనాలను అరికట్టాలి
  • మట్టిమనిషి వేనేపల్లి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: విద్యుత్ తీగలు పరికరాలు దొంగతనం రైతుల కష్టాలను యుద్ధ ప్రాతిపధికన విద్యుత్, వ్యవసాయ, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేసి దొoగతనాల నివారణ చేపట్టాలని మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు అన్నారు. వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుండి రైతుకు పుట్టెడు కష్టాలున్నాయన్నారు.ఇవి ఇవాళ్టివి కావు. భూమి మీద మనిషి వ్యవసాయం పేరుతో రైతు అవతారం ఎత్తి నప్పటినుండి వున్నవే అన్నారు. ఈ ఆధునిక కాలంలో పాత వాటితో పాటు కొత్తవి చేరినవన్నారు. కష్టనష్టాలు మాత్రం తప్పలేదు. అందులో విద్యుత్ తీగలు పరికరాలు యంత్రాలు దొంగతనం చేయడం.

ఈ సారి వర్షాలు ఆలస్యంగా పడటంతో రైతులు అనేక కష్ట నష్టాలు ఎదురుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు పడు తుంటే రైతులు విత్తనాలు విత్తడం, నార్లుపోయడం నాట్ల పనులు చేస్తున్నారు. గత రెండు దశబ్దాలుగా రైతులు విద్యుత్ వాడకం బాగా పెరిగిందన్నారు. దీనికోసం అనేక పోరాటాలు ఉద్యమాలు జరగడం ముదిగొండ, కాల్ దారి, భషిర్ బాగ్ ల్లో పోలీస్ కాల్పుల్లో రైతులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు.గత దశాబ్దంగా విధ్యుత్ కోత లేకపోవడంతో మరింత వాడకం పెరిగిందన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు వ్యసన పరులు.

సోమరిపోతులు వ్యవసాయ బోర్ల కాడ, బావుల కాడ, యంత్రాలు, పరికరాలు తీగలు ఎత్తుకుపోతున్నారు. దీనివల్ల రైతుకు చాలా నష్టం జరుగుతుందన్నారు. ఈ కాలంలో రైతులదగ్గర డబ్బులు వుండవు, వున్నా అవి కొనుకోచ్చి మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలంటే, పనివాళ్ళు దొరకరు, విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాట్లో వుండరు, కాలం నెత్తిమీదకు వస్తది. రైతుకు దుఃఖం మిగులుతదన్నారు. ఒక్కోసారి రైతు ల ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కూడా వుందన్నారు. ఇది ఒక ఊరి, మండల, జిల్లా సమస్య కాదు రాష్ట్ర సమస్య. ఇది అన్ని రాష్ట్రాల్లలోనూ వుందన్నారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.వ్యవసాయ, విద్యుత్, పోలీస్ శాఖ వాళ్ళు ఈ దొంగతనాలా వలన జరిగే కష్టనస్టాల గురించి విసృతంగా ప్రచారం చేయాలన్నారు. దొంగతనాలు చేయకుండా చూడాలి, దొంగతనం జరిగిన వెంటనే మూడు శాఖలు స్పందించి ఆ రైతుకు నష్టం జరగకుండా ఆ పనిముట్లు తాత్కాలిక ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులు దొంగలను పట్టుకుని వాటిని తిరిగి స్వాదీన పర్చుకుని వెంటనే రైతులకు అందించాలన్నారు. దొంగలు మళ్ళీ దొంగతనం చేయకుండా అతని స్థితి గతులు పరిశీలించి దొంగతనానికి గల కారణాలు తెలుసుకుని వాటిని నివారించాలన్నారు.దొంగలు వాటిని అమ్మకుండా పాత సామాన్లు కొనేవాళ్ళకు కొన్ని సూచనలు చేయాలన్నారు. వాటిని అమ్మే వ్యక్తి వాటిని పగల కొట్టకుండా, ముద్దగా చేయకుండా ఉంటేనే తీసుకోవాలన్నారు.

అమ్మే అతనికి ఆధార్ కార్డు ఉండాలి, సీసీ కెమెరాలు ఉండాలన్నారు. విద్యుత్ శాఖ లైన్ మెన్ అనుమతి పత్రం ఉoడాలన్నారు. వీటిని పాటించని వారిని రైతుల విద్యుత్ సామాగ్రి దొంగ ల నుంచి కొన్నవాళ్ళను కూడ శిక్షించి వాళ్లకు జరిమాన విధించాలి, వారి లైసెన్స్ రద్దు చేయాలన్నారు.

దొంగలు, తెచ్చిన వాహనాన్ని వెంటనే అమ్మివేసి ఆ డబ్బును విద్యుత్ శాఖకు ఇచ్చి వాటిని రైతుల అవసరాలకు ఖర్చు పెట్టాలన్నారు. దొంగలు రైతులు అయితే రైతుబందు బందు చేయాలి రుణమాఫీ రద్దు చేయాలి దొంగలను చేరసాలలో పెట్టకుండా ఆ రైతుల పొలంలో పనిచేయించాలన్నారు.

దొంగల మానసిక ఆర్ధిక సామాజిక స్థితిగతులను పరిశీలించి చేయాలన్నారు. మళ్ళీ ఆ వ్యక్తులు ఇంకోసారి దొంగలుగా మారకుండా చూడాలన్నారు. పోలీసులు దీన్ని చిన్న విషయంగా తీసుకోవద్దన్నారు.

పట్టిచ్చిన వారికి పోలీసులు బహుమతులు ఇవ్వాలన్నారు. వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. వాళ్ళు కోరితే వాళ్ళ పేర్లు రహస్యంగా ఉంచాలన్నారు. ప్రభుత్వo వెంటనే స్పందించి వ్యవసాయ, విద్యుత్, పోలీస్, న్యాయ శాఖలతో చర్చించి దీనికోసం కొత్త చట్టం తేవాలన్నారు. రైతులు వాడే వస్తువులు తయారు చేసే కంపెనీలకు చెప్పి అవి రైతులవి అని గుర్తుపట్టేలా సాంకేతిక విధానాలు ఉండాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉoడాలి,ఆధునిక జిపిఎస్, సీసీ కెమెరాలు వాడాలన్నారు. దొంగతనం జరిగినప్పుడు రైతులు కలిసి కట్టుగా ఉoడాలి దొంగలను పట్టుకోవాలన్నారు. రైతుకు అండగా ఉండాలి కావాల్సినవి తాత్కాలికంగా అందించాలన్నారు. దొంగతనం జరిగినప్పుడు కుటుంబసభ్యులు ఇరుగు పొరుగు- బంధువులు స్నేహితులు ఎవరన్నా చేసి వుండే అవకాశం ఉందా అని ప్రజలు ఆరా తీయండి, ఉంటే వాళ్ళను మార్చండి లేదా పట్టివ్వండన్నారు. పాత సామాన్లు కొనేవాళ్లకు అనుభవంతో అమ్మేవాళ్ళు ఎవరో పసిగట్టవచ్చన్నారు. రైతుల వస్తువు లు తెచ్చినప్పుడు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. రైతుల విద్యుత్ పనిముట్లు పరికరాలు తీగలు దొంగ తనం చెయ్యడం మామూలు విషయం కాదు. అది రైతుకు జీవన్మరణ సమస్యన్నారు. దొంగతనo చేయడం కూడా బాగా శ్రమతో కూడిన పని అందులోను కష్టాలు వుంటాయన్నారు. దొరికితే సామాజిక అవమానాలు ఉంటాయి దెబ్బలు తింటారన్నారు. ఇంత చేసి రైతుకు వందరూపాయలు నష్టం కలిగిస్తే దక్కేది పది రూపాయలు, బాగుపడేది లాభ పడేది దళారి వ్యాపారి, దొంగ మీరవుతారన్నారని చోరికి పాల్పడుతున్న వారిని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking