బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి..బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం — ఎన్ ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్.

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
  •  బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం.
  • ఎన్ ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్.

కొత్తగూడెం, అక్షిత న్యూస్: కొత్తగూడెం జిల్లా కేంద్రంగా బస్టాండ్ సెంటర్ లో అమరవీరుల స్తూపం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్ దహనం చేయడం చేసారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు ఢిల్లీలో బీసీలకు 42%రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలో చేసిన చట్టాలను రాష్ట్రపతి ఆమోదించాలని ధర్నాలు నిరసనలు చేశారు. కేంద్రంలోఉన్న బీజేపీ ప్రభుత్వ పెద్దలు తెలంగాణ బిజెపి నాయకులు బీసీ రిజర్వేషన్లకు అడ్డుగోడలుగా నిలుస్తూ బీసీ వ్యతిరేకులుగా చాటిచెప్పుకున్నారని ఢిల్లీ వేదిక నుండి ప్రతి గల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐనాయకులు షేక్ నయీమ్,షేక్ అజహార్, ఠాకూర్ తరుణ్ సింగ్,షేక్ మోహిన్, కాటి సందీప్,కొత్తగూడెం టౌన్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉర్సు శివ,శరత్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking