జానపద అకాడమీని ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలి.!

కొత్తగూడెం, అక్షిత న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం శనివారం కొత్తగూడెంలోని ప్రకృతి ఆశ్రమంలో జిల్లా అధ్యక్షుడు గద్దర్ బాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి పమ్మి రవి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ర్యాంలో లక్షలాది జానపద కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పాటలు, ఆలాపనల ద్వారా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కనుమరుగవుతున్న జానపద కళలను కాపాడాలంటే ప్రభుత్వం తక్షణమే అధికారికంగా జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, ప్రతి సంవత్సరం ఆగస్టు 2న జరుపుకునే ప్రపంచ జానపద దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించాలన్నారు. కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నెలలో కనీసం పది రోజులపాటు కళాజాతలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జానకీరామ్, కోశాధికారి షేక్ ఖాసిం, ప్రచార కార్యదర్శి కనకం కొమరయ్య, ఉపాధ్యక్షులు దాసరి వీరమోహన్, ప్రసన్న, తేలోతు కృష్ణ, విజయ్, లక్ష్మి, తిరుపతయ్య, జ్యోతి, మూర్తుజా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking