నాగారం, అక్షిత న్యూస్: నాగారం మండల జెడ్పిటిసి స్థానంపై అధికారపక్షం, ప్రతిపక్షం నేతలు ఊహత్మకంగా లోలోపట పావులు కదుపుతున్నట్టు ముఖ్య సమాచారం. నాగారం మండల జెడ్పిటిసి గతంలో ఎస్సీ మహిళ కు రిజర్వుడు కాగా, ఈసారి బీసీలకు రిజర్వ్డ్ అయ్యే అవకాశాలు మెండుగా ఊహాగానాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మండల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బిసి లకు సుముచిత ప్రాతినిధ్యం కల్పించడానికి తీసుకున్న నిర్ణయం ప్రకారం మండల జెడ్పిటిసి స్థానం బిసి లకే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మండల పరిధిలోని అధికార కాంగ్రెస్ పక్షం నాయకులు లోపాయకారికంగా ఎవరికి వారే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా అంచనా. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి కన్నెబోయిన వెంకట బిక్షం, ఆకుల బుచ్చిబాబు, తొడుసు లింగయ్యలు ఆశిస్తుండగా ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీ నుండి కల్లెట్లపల్లి ఉప్పలయ్య, గుండగాని అంబయ్య, చిల్లర చంద్రమౌళి లు, బిజెపి పార్టీ నుండి మొల్కాపురి చిరంజీవి, దేశగాని నరసయ్య లు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నుండి సంపెట కాశయ్య, సిపిఐ(ఎం) నుండి కూడ ఒకరు బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు బలంగా ఆశిస్తున్నట్లు వినికిడి. మండల పరిధిలో అన్ని బిసి కులాలలోకెల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన 3000 ఓటర్లు ఎక్కువగా ఉండటం వలన యాదవ సామాజిక కులానికి చెందిన వ్యక్తికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు విశ్వనీయ సమాచారం. కులాల ప్రాతిపదికత ఆయా పార్టీల అభిప్రాయంపై ఉంటుంది. ఈ ఆశాభావులలో ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో, నాగారం మండలం నుండి జిల్లా పరిషత్ లోకి, మండల జెడ్పిటిసి ఎవరు అడుగుపెడతారో వేచి చూడాల్సిందే.