సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల
అప్రమత్తంగా ఉండాలి

పది పరీక్షల్లో నూరు శాతం
ఫలితాలు సాధించాలి

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

వర్షకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిహెచ్ సికి వచ్చే
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ నవాబ్ పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్మన్ గండ్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పిఎంఏవై సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

పిహెచ్ సిలో నిన్న రాత్రి ప్రసవించిన మహిళ తో కలెక్టర్ మాట్లాడారు. పిహెచ్ సిలో వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. పిహెచ్ సి లో ప్రసవాల గురించి, ఓపి గురించి, మందుల లభ్యత గురించి, సిబ్బంది గురించిన మెడికల్ ఆఫీసర్,వైద్య సిబ్బంది తో మాట్లాడి తెలుసుకున్నారు.ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మండలంలో డెంగ్యూ కేసులు, సీజనల్ వ్యాధుల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.డెంగ్యూ, సీజనల్ వ్యాధులు వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఉందని, గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గ్రామంలో ఇక ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశించారు.

నవాబ్ పేట్ మండల కేంద్రంలో నిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల ప్రాంగణమంతా తిరిగి పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో వర్షం నీరు నిలిచి ఉండడం గమనించి వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులను పాఠశాలలో బోధన, సబ్జెక్ట్ లలో ఏదైనా ఇబ్బంది ఉందా, సమస్యలు ఉన్నాయా? అడిగారు. పాఠ్యాంశాలలో ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ప్రణాళికాబద్ధంగా చదివి వార్షిక పరీక్ష లలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు.గత సంవత్సరం ఎస్ఎస్ సిలో ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల సంఖ్య గురించి అడిగారు. గత సంవత్సరం 86 శాతం ఉత్తీర్ణత సాధించారని, మొత్తం 123 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంచాలని, నూరు శాతం ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు పాఠశాలలో విద్యార్థులకు అదనపు టాయిలెట్ లు కావాలని హెడ్ మాస్టర్ కలెక్టర్ ను కోరారు. నవాబ్ పేట్ మండలంలో ఎన్మన్ గండ్ల గ్రామంలో
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను పిఎంఏవై సర్వే ఏ విధంగా చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరిశీలించారు. అప్ లోడు ఫోటో క్యాప్చరింగ్ చేయటం,  ఫేస్ ఆథేoటిఫికేషన్ లో చేయటంలో టెక్నికల్ ఇబ్బందులు గమనించారు. సర్వే గురించి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ఎంపిడిఓ జయరాం నాయక్, తహశీల్దార్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, మండల, గ్రామ అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking