ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, అక్షిత న్యూస్ :
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద నీటి ప్రవాహం వస్తున్నందున భువనగిరి నుండి చిట్యాల నల్లగొండ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నుండి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు.
జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలో పలు చోట్ల ప్రధాన రహదారులపై నుండి భారీ ఎత్తున వరద నీరు పోటెత్తింది దీంతో రోడ్డు మార్గాలను పోలీసులు నిలిపి వేయడం జరిగింది. వాహనదారులు ప్రజలు వరద నీటిలో ఏమి కాదు లే అనే ధీమాతో దాటే ప్రయత్నం చేయకూడదని కలెక్టర్ అన్నారు. నేటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని కాబట్టి ప్రజలు అలాంటి చర్యలకు పాల్పడవద్దని అన్నారు. కొందరు వరద నీటిలో చేపలు పట్టడానికి కూడా ప్రయత్నం చేస్తు వరద లో చిక్కికపోతున్న సంఘటనలు కూడా చూసాం కాబట్టి అలాంటి సాహసాలు కూడా ఎవరు చేయొద్దు అని అన్నారు. ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. వర్షాలు తగ్గే వరకు కూడా ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని సూచించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ పంచాయతీ,అధికారులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సంబంధిత అధికారులు అందరూ పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.