చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

చదువుతోనే
ఉజ్వల భవిష్యత్తు

రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీ

కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యే

వరంగల్, అక్షిత బ్యూరో:
చదువుతోనే విద్యార్ధులకు భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ సత్య శారద అన్నారు. గురువారం ఖిలా వరంగల్ మండలం జక్కలొద్దిలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్షన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. పాఠశాలలోని మౌలిక వసతులు కల్పించాలన్నారు.
భవనంలోని డార్మెంటరీ, భోజనశాల, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల యోగక్షేమాలు, వారికి కావలసిన అవసరాలను అడిగి తెలుసుకుని విద్యార్థుల వివిధ సబ్జెక్టుల పఠన సామర్ధ్యాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking