మట్టి గణపతులతోనే
పర్యావరణ పరిరక్షణ
తాజా మాజీ కార్పొరేటర్
చిట్ల దివాకర్
ప్రగతినగర్ లో గణనాథునికి
ఘనంగా తొలిరోజు పూజలు
నిజాంపేట, అక్షిత న్యూస్ :
మట్టి గణపతులతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ లో శ్రీ మహాగణపతి ఆలయంలో అభిషేకం, మహాగణపతి ఉత్సవ సమితి చైర్మన్, 2వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్ అధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో చిట్ల దివాకర్, గణపతి విగ్రహ దాత నల్లా మధుకర్ రెడ్డిలు సతీసమేతంగా తొలిరోజు పూజలు చేశారు. ఈ సందర్భంగా చిట్ల దివాకర్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని, మట్టి గణపతి విగ్రహాలనే పూజిస్తూ పర్యావరణాన్నీ కాపాడాలని, వర్షా కాలం దృష్ట్యా వినాయక మండపాల వద్ద విద్యుత్ షాక్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.