మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవాలి
సూర్యాపేట జిల్లా జాగృతి అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి
కోదాడ, అక్షిత ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో చెరువులో పడి బాలుడు కుక్కడపు మనోజ్ మృతి చెందడం పట్ల సూర్యాపేట జిల్లా జాగృతి అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి విచారణ వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.