మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కమిటీ ఎన్నికను పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తరి ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షునిగా జిల్లా నగేష్ మహారాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా రవి, బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా క్రాంతి, మట్టయ్య, కార్యదర్శి సందీప్, కోశాధికారి చందు, కమిటీ సభ్యులుగా ప్రేమ్ సాగర్, మహేందర్, పరశురాం, కిరణ్, సుమంత్, కార్తీక్ లను నూతనంగా ఎన్నుకున్నారు.