- దివ్యాంగులకు కృత్రిమ పాదాలు
- ఏకం, రోటరీ ట్రస్ట్ చేయూత
- 110 మందికి ఉచితంగా పాదాలు పంపిణి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: ఏకం యూఎస్ఏ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయంతో మిర్యాలగూడ రోటరీ క్లబ్, ఖమ్మం రోటరీ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన శిబిరంలో 110 మందికి ఉచితంగా కృత్రిమ పాదములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ మల్లాది వాసుదేవ్, మిర్యాలగూడ రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు ప్రోగ్రాం చైర్మన్ రేపాల అంతయ్య, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ గౌరు దయాకర్, రంగా హరినాథ్ లు మాట్లాడుతూ జులై నెలలో పాదాల సైజుల ఎంపిక శిబిరంలో 110 మంది దివ్యాంగుల సైజులను సేకరించడం జరిగిందన్నారు. వారందరికీ పాదాలు ఉచితంగా ఏకం యూఎస్ఏ ఆర్థిక సహాయంతో అమర్చడం జరిగిందన్నారు. ఉచితంగా కృత్రిమ పాదాలను 1981 సంవత్సరం నుంచి ఏకం యూఎస్ఏ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయంతో పంపిణీ శిబిరాలు నిర్వహిస్తున్నారని, నేటి వరకు సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో 13,500 మందికి ఉచితంగా కృత్రిమ పాదాలు అందజేసీ అమర్చినట్లు మాజీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్లాది వాసుదేవ్ తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం రోటరీ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు సాంబశివరావు, ఖమ్మం రోటరీ క్లబ్ అధ్యక్షులు వి.రామారావు, రైస్ మిల్లర్స్ కోశాధికారి చిల్లంచర్ల శ్రీనివాస్, మిర్యాలగూడ రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు మంచుకొండ వెంకటేశ్వర్లు, కుక్కడపు రామ్మూర్తి, మాశెట్టి సుదర్శన్, చిల్లంచర్ల రామారావు, క్లబ్ కార్యదర్శి రేపాల వాసవి, గంధం శ్రీనివాస్ పాల్గొన్నారు.
