అభాగ్యులకు… అన్నదానం

అభాగ్యులకు
        అన్నదానం

అమ్మ నాన్న అనాధ ఆశ్రమంలో శ్రీనివాస్ గౌడ్
బర్త్ డే వేడుకలు

చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :

వందలాది మంది అభాగ్యులు. ఆలనా పాలనకు నోచుకోనివారు. మానసిక పరివర్తన సరిగ్గా లేదు. అలాంటి అభాగ్యులకు అమ్మ నాన్న అనాధ ఆశ్రమం ఆశ్రయమైంది. హైదరాబాద్ నగరo అమీర్ పేటకు చెందిన ఎం. శ్రీనివాస్ గౌడ్ బర్త్ డే వేడుకలను పురస్కరించుకొని ఆశ్రమంకు వెళ్లాడు.హృదయం జ్వలించింది. ఎంతో మంది బిడ్డలకు ఆశ్రమం చేస్తున్న పరిచర్యకు ముగ్ధుడయ్యాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆరితేరిన ఎం. శ్రీనివాస్ గౌడ్ గత 8 ఏళ్లుగా టిఎంఆర్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ లో మార్కెటింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మార్కెటింగ్ మెలుకువలు నేర్పిస్తూ ఎంతోమందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఏ పని చేసిన అంకిత భావంతో పనిచేసి వృత్తికి వన్నె తేవడం అతని సొంతం. ఆదివారం శ్రీనివాస్ గౌడ్ బర్త్ డేను పురస్కరించుకొని అమ్మ నాన్న అనాధ ఆశ్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మానసిక స్థితి సరిగ్గా లేని ఎంతో మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని, భోజనం, వసతితో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారిని మామూలు స్థితికి తెచ్చేందుకు ఆశ్రమం కృషి అనిర్వచనీయమన్నారు.

అన్నదానం…మహాదానం అంటూ ఈ రోజు నాకు చాలా సంతృప్తి నిచ్చిందన్నారు. ఉండేందుకు చోటు లేని అభాగ్యులెందరికో ఆశ్రయం నీడ నిస్తుందని, అలాంటి సంస్థ మనుగడకు కాసింత ఆసరాగా నిలవాలని ఆయన కోరారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి ఆహారం, వసతి, వైద్యం అందిస్తున్నారన్నారు. అనంతరం టిఎంఆర్ చేగుంట ప్రాజెక్టులో బర్త్ డే సంబరాలు జరిగాయి. శ్రీనివాస్ గౌడ్ ను శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిఎంఆర్ మార్కెటింగ్ లీడర్స్ కేజీ నర్సయ్య, రాజ బాబు, విజయ్ కుమార్, జయంతి, శర్మిష్ఠ, భవేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking