- ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి విఘ్నేశ్వరుని లడ్డు వేలం 5,15,001
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి: మాదాపూర్ డివిజన్ హార్జిన్ భాస్తి లో నిఎస్సీ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ వారి ఆధ్వర్యంలో కొలువైన గణనాధుని వద్ద నిత్య పూజలు అందుకున్న లడ్డూ ప్రసాదంల వేలం పాటలు పోటా పోటీగా నడిచాయి స్వామి వారి మొదటి పెద్ద లడ్డూ ను ఈరన్ గణేష్ 5,15001/- ల కు ఈరన్ గణేష్, సాయి దక్కించుకున్నారు.అదేవిధంగా కలశం చెంబును 1,20,001/- లకు ఈరన్ రాజు,జ్ఞానేశ్వర్ కైవాసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల మహెూత్సవం ను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలియ జేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాదం ను దక్కించుకున్న వారికి వారి కుటుంబ సభ్యులకు విఘ్నాలు తొలగించి విజయాలు సాధించేలా స్వామీ వారి కృపా కటాక్షముల ఉండాలని ఆకాంక్షించారు. వారికి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. వేలంపాట పాడి తీసుకున్నారు. వారిని కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి, స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళల వారి కుటుంబ సభ్యులకు ఉండాలి అని ఆకాంక్షించారు.
