ఎన్నికల కమీషన్ పై
సన్నగిల్లుతున్న విశ్వసనీయత
మేల్కోపోతే
భవిష్యత్ అంధకారం
-ప్రముఖ వక్త పరకాల ప్రభాకర్
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోతుందని ప్రముఖ వక్త పరకాల ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఖమ్మం భక్త రామదాసు కళా క్షేత్రంలో ప్రత్యామ్నాయ పౌర సమూహం ఆధ్వర్యంలో ఎలక్షన్ కమీషన్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ పేరుతొ బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించటాన్ని నిరసిస్తూ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు అధ్యక్షత వహించిన డా. రవీంద్రనాధ్ మాట్లాడుతూ ఖమ్మం వాసి ఈ రోజు గణపతి లడ్డును 50 లక్షల పైన ఖరీదు కి కొనడం ఒక విషయమైతే గత నెల పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ర్యాలీ జరగటం మరొక మంచి విషయం అన్నారు.ఖమ్మం ప్రజలు మానవతా విలువలు ప్రజాస్వామ్య విలువలు పట్ల ఎప్పుడూ సరైన దృక్పధంతో నిలబడతారని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో అధికారంలో వున్నవాళ్లు ఎన్నికలను ఏ రాష్ట్రంలో గెలవాలో ఏ రాష్ట్రాలను వదిలి వేయాలో నిర్ణయించుకొని ఎలెక్షన్లను నిర్వహిస్తున్నారు.గెలవాలనుకున్న రాష్ట్రాలలో ఎక్కువ దశలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు.

ఎన్నికల నిర్వహణ అనేది రాజకీయ పార్టీల వ్యవహారం కాదని ప్రజలకి ప్రజాస్వామ్యానికి సంబంధించినదని అన్నారు.ఎన్నికల కమిషనర్ల నియామకంలో చీఫ్ జస్టిస్ ను తప్పించి కేంద్ర మంత్రిని చేర్చటం ద్వారా విశ్వసనీయత దెబ్బతిందన్నారు. ఎన్నికలు ముగిసిన రోజు ప్రకటించిన వోటింగ్ శాతానికి ఫైనల్ వోటింగ్ శాతానికి మధ్య
11 రోజుల సమయం పట్టిందన్నారు. చండీఘడ్ లో కేవలం 644 పోలింగ్ బూతుల సమాచారం రావటానికి 5 రోజులు పట్టటం హాస్యాస్పదం అన్నారు. ఆంధ్రా లో ప్రొవిషనల్ ఫైనల్ పర్సెంటేజీల మధ్య తేడా 12 .5 % గా ఉందన్నారు.గత లోకసభ ఎన్నికలలో ఈ శాతం 5 కోట్ల ఓట్లుగా ఉంది. ఈ తేడా లేకపోతె ప్రతిపక్ష పార్టీ లకు 305 సీట్లకు పైగా వచ్చేవన్నారు. ఫేస్ 2 ఎన్నికల డేటా కనీసం స్టేట్ విస్ గా కూడా ఇంతవరకు లేదన్నారు. ఇందులో మెజారిటీ స్థానాలు ఎన్డీయే నెగ్గటంలో ఆశ్చర్యం లేదు. దేశంలో ఇంతవరకు ప్రొవిషనల్ ఫైనల్ ఓట్ల శాతాలలో 2 % కన్నా ఎపుడు వ్యత్యాసం లేదు. మొన్న యుపిలో ఈ వ్యత్యాసం 2 % మాత్రమే ఉంటె ఎన్డీయే సీట్లు తగ్గాయి. ఎన్నికల సంఘం మహా మాయాజాలం వల్ల ఎన్నికల ఫలితాల తర్వాత పోలింగ్ శాతాన్ని ప్రకటించటం జరుగుతుందన్నారు. సుప్రీం కోర్టు అడిగినా సరైన వివరాలు ఇవ్వటంలేదు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కాదు ప్రభుత్వమే వోటర్లని సెలెక్ట్ చేసుకొంటుంది. ప్రభుత్వం నెమ్మదిగా ప్రజలకు ఓట్ల చోరీని అలవాటు చేస్తోందని ప్రజలు మేల్కొనక పొతే భవిష్యత్తు అంధకార మైతుందన్నారు.హిందూ రాజ్యం స్థాపిస్తామంటే జనసంఘ్ పార్ట్ కి వచ్చిన ఓట్లు అత్యధిక శాతం 9.5 %. ఇప్పుడు అవినీతి ఎమర్జెన్సీ పేరుతొ అనేక ప్రతిపక్షాల సహకారంతో నెమ్మదిగా అధికారం లోకి వచ్చినవాళ్లు ఇప్పుడు తప్పుడు ఓట్లతో వాళ్ళ హిందూ ఎజెండాను ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ దేశం ఒక్క ఆత్మ ఎన్నికల ప్రజాస్వామ్యం లో ఉంది. దీని ఖమ్మం ప్రజలు వదలకుండా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పౌర సమూహం నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.