సామాజిక బాధ్యతతో పని చేయాలి

సామాజిక బాధ్యతతో
పని చేయాలి
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పలు శాఖల పనులపై రివ్యూ తీసుకొని వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతతో పనిచేయాలనేది సమావేశ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మిర్యాలగూడ అధికారులు అంటే నిబద్దత కలిగి ఉంటారనే సందేశం ప్రజల్లోకి తీసుకొని పోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంత చేసినా ప్రభుత్వం ఎంత చేసిన అధికారులు సక్రమంగా పనిచేయకపోతే వ్యవస్థలో మార్పులు రావన్నారు. రాజకీయ నాయకుల కంటే కూడా ప్రభుత్వ అధికారుల బాధ్యత చాలా ప్రధాన మైనదన్నారు.ప్రజాప్రతినిధులు కొంత కాలం మాత్రమే ఉంటారని పదవులు శాశ్వతం కాదు కానీ అధికారులు మాత్రం శాశ్వతంగా ప్రజల తరపున పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా తమ డ్యూటీ సరిగా చేయకపోతే వెంటనే వారిపైl కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమృత్ 2.0 కింద 10 ఓవర్ హెడ్ ట్యాంకులు వీలైనంత త్వరగా నిర్మించాలన్నారు ఎస్టీపి -1, ఎస్టీపి -2 పని చేసే స్థితిలో ఉండాలన్నారు. మునిసిపల్ పరిధిల్లో తాగునీటి పైప్‌లైన్ వేయబడుతుందన్నారు. రాజీవ్ చౌరస్తా వద్ద పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. బ్యూటిఫికేషన్ ఆఫ్ వర్క్స్ టీయు ఎఫ్ ఐ డి సి కింద పెండింగ్‌లో ఉన్న సుందరీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయబడతాయన్నారు. మురుగ మునిసిపాలిటీ కోసం మురుగునీటి గల్పర్ యంత్రం కొనుగోలుప్రతిపాదించాలన్నారు. జాతీయ రహదారి మార్గంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లైఓవర్, సుందరీకరణ పనులు త్వరీతంగా చేయాలన్నారు. రివ్యూ మీటింగ్ లో సూపరింటెండింగ్ ఇంజనీర్, డిప్యూటీ డైరెక్టర్లు ఎంఇ అండ్ పి హెచ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి విద్యుత్, ఎఇలు, మేనేజర్, టీపిఎస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు

Leave A Reply

Your email address will not be published.

Breaking