ప్రతీ రైతుకు యూరియా
అందించాలి
*ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలోని ప్రతి రైతుకు యూరియా అందించాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ కోరారు. మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు అధికారులు, సిబ్బందితో ఆదివారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతీ రైతుకు, ప్రతీ ఎకరాకు యూరియా అందేవిధంగా ప్రతిఒక్కరం కృషి చేయాలన్నారు.

బ్లాక్ మార్కుట్ లో దళారులకు యూరియా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టేందుకు కేంద్రం యూరియా కోత పెట్టి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టె విధంగా వచ్చిన యూరియా అవసరమున్న ప్రతీ రైతుకు అందేవిధంగా ఒక ప్రణాళికతో చేయాలన్నారు. రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, రైతుల పక్షాన ఉండి రైతులకు అండగా ఉంటామన్నారు.