వెట్టి చాకిరితో బాల్యం ఛిద్రం..

వెట్టి చాకిరితో
బాల్యం ఛిద్రం..

బాల్యం బుగ్గిపాలు

* భావిభారత పౌరులుగా ఎదగాల్సిన బాలలు
*
* బాల్యంలోనే కార్మికులుగా మగ్గిపోతున్నారు.

* భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి, సాయి హోటల్ లో ఘటన

భువనగిరి, అక్షిత న్యూస్ :

భావిభారత పౌరులుగా ఎదగాల్సిన బాలలు, బాల్యంలోనే కార్మికులుగా మగ్గిపోతున్నారు. కుటుంబ పోషణభారమై పిల్లలను చదివించే ఆర్థిక స్తోమతలేక పనిలోకి దించుతున్నారు. మరికొందరు బాలలు తల్లిదండ్రుల ఆదరణలేక, తల్లిదండ్రులు లేని అనాథలు దిక్కులేని పరిస్థితుల్లో బాలకార్మిక వ్యవస్థలోకి వెళుతున్నారు. ఇటువంటి బాలల జీవితాలను బాల్యంలోనే మగ్గిపోనీయకుండా వారిని చేరదీసి మంచి చదువును అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాలు బాలకార్మిక చట్టాలను తీసుకువచ్చింది.ఆ చట్టాలను అంత పకడ్బందీగా సాగడంలేదనే విమర్శలున్నాయి. అనాథ బాలలు,బాల కార్మికులను గుర్తించి వారికి ఆశ్రయం కల్పించి చదువు,హాస్టల్ వసతి కల్పించినా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం కావడం లేదు.

ప్రతి ఏడాది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,పోలీసులు,చైల్డ్ లైన్ ప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఇటుక బట్టీలు, హోటళ్లు, రెస్టారెంట్,ఇతర పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి కూలీలుగా పని చేస్తున్న బాలబాలికలను గుర్తించి వారి కుటుంబ సభ్యులు, బంధువులతో స్వస్థలాలకు పంపిస్తున్నారు. తాజాగా మంగళవారం భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఓ హోటల్ లో పని చేస్తున్న సుమారు 10 సంవత్సరాల బాలిక,తాగిన సిసలు,గ్లాసులు తీస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking