దోమల బెడద. శానిటేషన్ విభాగం ఉన్నట్లా లేనట్టా..?
నిర్లక్ష్యపు నిద్ర మత్తులో మున్సిపల్ అధికారులు.
గ్రామాల్లో విపరీతంగా దోమలు ఫిర్యాదులు చేసిన పట్టించుకుని అధికారులు..
పురపాలక లో 28 పాకింగ్ మిషన్లు..అందులో పని చేసేది మిషిన్ ఒక్కటే..
ఆరు గ్రామాలలో పాకింగ్ ఒక్క మిషిన్ తో జరిగేది సాధ్యమేనా.? అంటూ ప్రజలు విమర్శలు వెల్లువ..
మేడ్చల్,అక్షిత బ్యూరో: దుండిగల్ పురపాలక లో విపరీతంగా దోమల బెడద గ్రామాలలో దోమల బెడద ఉందంటూ ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు. దోమ కాటుతో వచ్చే విష జ్వరాలు ద్వారా మలేరియా టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులతో హాస్పటల్లో పాలవుతున్న కూడా అధికారులు నిర్లక్ష్యపు ధోరణిలో పని చేస్తున్నారా అంటూ లేక.సిబ్బంది వైఫల్యం అంటూ ప్రజలు నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. పురపాలక ఆరు గ్రామాలలో పాకింగ్. ఒకే మిషిన్ తో సాధ్యమేనా. ఏ గ్రామంలో అయినా పూర్తిస్థాయిలో పాకింగ్ చేయడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు.

సయానా మున్సిపల్ కార్యాలయంలోనే కంప్యూటర్ సిస్టంలో ఉన్న ఆపరేటర్స్ అందరికీ దోమల బెడద ఉందంటూ చెప్పుకోలేక. ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి ఉందంటూ వాపోతున్నారు. మా కార్యాలయంలోనే ఇలా ఉందంటే గ్రామంలో ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు అంటూ విమర్శలున్నాయి అధికారులు ఇప్పటికైనా కమిషనర్ చొరవ తీసుకొని గ్రామానికి ఒక్క పాకింగ్ మిషన్ తో గ్రామంలో చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు..