పాత్రికేయులకు కొండంత అండ

పాత్రికేయులకు
కొండంత అండ

ఇళ్ల స్థలాలిచ్చి
జర్నలిస్టులకు ఆసరాగా

సబ్ కలెక్టర్ గా
ఏడాది పూర్తి

డ్రై ఫ్రూట్ తినిపించి
శాలువాతో సత్కరించి

అమిత్ ను సత్కరించిన
పాత్రికేయులు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించారు. ఇటు ప్రజా సమస్యల పరిష్కారoలోనూ, అటు జర్నలిస్టుల సంక్షేమానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్
నారాయణ్ అమిత్ మల్లెంపాటి ఆసరాగా నిలిచారు. మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం మిర్యాలగూడ పాత్రికేయులు చిరు సత్కారం చేశారు. జ్ఞాపికను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ చే అందజేశారు. డ్రై ఫ్రూట్ తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. సంవత్సర కాలంలో దీర్ఘాకాలిక పాత్రికేయుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు సహకరించడం అభినందనీయమని పాత్రికేయులు అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధిలో ఎమ్మెల్యే ప్రతిపాదించే పనులు వేగంగా చేసేలా సహకరించడం సకాలంలో చేయడం వృత్తి ధర్మాన్ని పాటించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఖాజా హామీదుద్దీన్, రంగా శ్రీనివాస్, ఎండి.అస్లాం, ఎండి. అయూబ్, ఖాజా నాజిముద్దీన్, పి.యాదగిరి, కె.నాగాచారి, మంద సైదులు, బొంగరాల మట్టయ్య, గుండా మహేష్, టీ. రాజారాం, వినయ్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking