బడులు,వసతి గృహాలకు నూతన భవనాలు నిర్మించాలి..

బడులు,వసతి గృహాలకు నూతన భవనాలు నిర్మించాలి..

వరంగల్, అక్షిత బ్యూరో:

వరంగల్ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళు,హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి లాదెళ్ల శరత్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ డిఆర్ఓ విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వ స్కూలు, హాస్టల్లో కాలేజీల భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలకు నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. సొంత భవనాలు లేక శిథిలావస్థలో ఉన్నటువంటి పలు విద్యాసంస్థల్లో చదువుతున్నాను వారు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారని తెలిపారు.. జిల్లాలోని స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్లో గురుకులాలకు సొంత భవనాలు లేవని నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారధి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking