పేదల కన్నీళ్ళని తుడిచిన ఆలకుంట్ల బాలకృష్ణ

పేదల కన్నీళ్ళని తుడిచిన ఆలకుంట్ల బాలకృష్ణ

ఓర్సు శ్రీను కుటుంబానికి రూ.10,000/-ఆర్థిక సహాయం

నాయకత్వం కంటే మానవత్వానికి ప్రాధాన్యం

వర్గ బంధానికి అండగా నిలిచిన ఆపద్బాంధవుడు

సహాయం వ్యక్తిగతం అయినప్పటికీ సమాజానికి స్ఫూర్తి

ప్రభుత్వం నుంచి తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

నాగారం, అక్షిత న్యూస్ :- మండల కేంద్రానికి చెందిన ఓర్సు శ్రీను ఇటీవల ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించగా ఆపదలో ఉన్న మృతుని కుటుంబానికి వడ్డెర మేలుకొలుపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ బుధవారం తన సొంత డబ్బులు, తను వ్యక్తిగతంగా మృతుని కుటుంబానికి రూ. 10,000/-ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సాధారణ కుటుంబానికి చెందిన కూలీ కష్టం మీద జీవనం సాగిస్తున్న ఓర్సు శ్రీను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం మా వడ్డెర వర్గానికి తీరని లోటు అని ఆయన మృతితో తన భార్య పిల్లలు ఆర్థికంగా సామాజికంగా కష్టాల్లో మునిగిపోయారని తన బాధను వెలిబుచ్చారు. వడ్డెర సామాజిక వర్గానికి మద్దతుగా, బాదిత కుటుంబానికి తోడుగా ఉండడం మనందరి బాధ్యత అని తెలుపుతూ వడ్డెర మేలుకొలుపు సంక్షేమ సంఘం కేవలం ఒక సంఘం కాదు, వడ్డెర వర్గానికి అండగా నిలబడే ఒక బలమైన స్తంభం అని అన్నారు. వడ్డెర కులం అనేది శ్రమతో, చెమటతో జీవించే వర్గం అని తెలిపారు. కానీ ప్రభుత్వ పథకాలలో సహాయక కార్యక్రమాలలో తరచూ నిర్లక్ష్యం ఎదురవుతుందని, ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు అధికార యంత్రాంగం నుంచి వెంటనే ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు. కేవలం మాటలు కాదు, ఆచరణలోనూ న్యాయం జరగాలని మా జాతి కోరుకుంటుందని తెలిపారు. కరెంటు షాకు వల్ల జరిగిన ఈ విషాద ఘటనకు విద్యుత్ శాఖ, జిల్లా అధికారులు బాధ్యత వహించి మృతుని కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుని కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం లేదా ఇతర స్థిరమైన ఆదాయ వనరు కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేశారు. వడ్డెర సమాజం ఎప్పుడు ఏకమై కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకుంటూ వస్తుందని, కానీ ఇలా వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వమే ముందుకు వచ్చి పేదల జీవితాలను రక్షించే విధంగా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వడ్డెర కులస్తులు చెమటోడ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారని, వారి శ్రమ ఫలితమే రహదారులు, చెరువులు, గృహాలు, కట్టడాలు అలాంటి చెరగని ముద్ర వేసిన వడ్డెర వర్గానికి సమాజంలో ఒక అరుదైన గౌరవం ఉందని కొనియాడారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న వడ్డెర జాతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రజా ప్రభుత్వాన్ని కోరారు. మనకు మనమే ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడం కాదు మొత్తం మన వడ్డెర వర్గానికి ప్రభుత్వం స్థిరమైన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వడ్డెర మేలుకొలుపు సంక్షేమ సంఘం తమ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటుందని, సంఘం ఎప్పుడు ఎలాంటి ఆపదలో ఉన్న కుటుంబాలకు వెన్నంటి నిలబడుతుందని, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వడ్డెర కులస్తుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర మేలుకొలుపు సంక్షేమ సంఘం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ శివరాత్రి గోపి, మండల అధ్యక్షులు వీరస్వామి, రాష్ట్ర నాయకులు కొడదల రాజు, కొడదల మహేష్, ఆలకుంట్ల వెంకన్న, ఆలకుంట్ల నవీన్, పల్లపు సతీష్, బండారి రాజు, ఓర్సు రాజు,

Leave A Reply

Your email address will not be published.

Breaking