రైతులకు ఉచిత వేరుశనగ విత్తనాలు
వనపర్తి/ పానుగల్ అక్షిత న్యూస్ :
పానుగల్ మండల రైతులకు ఉచిత వేరుశనగ విత్తనాలు మంజూరైనట్లు ఏడిఏ తిప్పేస్వామి తెలిపారు. బుధవారం మండలానికి వచ్చిన విత్తనాలను అధికారులు, కాంగ్రెస్ నాయకులు కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు కేతేపల్లి రవి, వెంకటేష్ నాయుడు, బ్రహ్మయ్య, పుల్లారావు, సింగిల్ విండో డైరెక్టర్ సాయిప్రసాద్ గౌడ్, మాజీ సర్పంచ్ వెంకటయ్య యాదవు, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.రైతులకు ఎకరాకు ఐదు ప్యాకెట్ల చొప్పున, ఒక్కొక్కరికి 180 కేజీల విత్తనాలను ఉచితంగా అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఈ విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.