ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
వలిగొండ /అక్షిత న్యూస్:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమ పాలన వివరిస్తూ ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి సీట్లు పంపిణీ చేశారు.మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి జగన్నాధ రావు ఎంపీడీవో జలంధర్ రెడ్డి, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ దశరథ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,కార్యాలయ సిబ్బంది, తదితరుల పాల్గొన్నారు