కన్న ఊరు మమకారం
మర్చిపోని మహోన్నత
వ్యక్తి మోహన్ రెడ్డి
* గూడూరు మోహన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం
* మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం
వలిగొండ/అక్షిత న్యూస్:
రైతుల సంక్షేమం కోసం దివంగత రిటైర్డ్ ఎస్ ఈ గూడూరు మోహన్ రెడ్డి సేవలందించారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంగెం బ్రిడ్జి వద్ద ఎదుళ్లగూడెంలో వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మోహన్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మోహన్ రెడ్డి చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం వల్ల సుమారు 600 ఎకరాల రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.

పుట్టిన గడ్డపై ప్రేమతో తన ప్రాంతా రైతులు ఇబ్బందులు పడకుండా ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి రైతులకు సాగునీటి ఎద్దడిని తీర్చారని వారన్నారు. అదేవిధంగా మూసీ సుందరీకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణ బద్ధులై సంగెం మూసి బ్రిడ్జి కోసం 47 కోట్లతో నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా నాయక్,డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, బద్ధం సంజీవరెడ్డి, కాసుల వెంకన్న, బోళ్ళ శ్రీనివాస్, జక్కజంగారెడ్డి, మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు