కమ్యూనిస్టుల పోరు ఫలితమే విలీనం

కమ్యూనిస్టుల పోరు
ఫలితమే విలీనం

నిజాం ఆకృత్యాలకు తెర

* ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

వలిగొండ/ అక్షిత న్యూస్:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి పార్టీని తిప్పి కొట్టండి అని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పార్టీ నూతన ఆఫీస్ స్థలంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాలు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పీడిత తాడిత, వ్యవసాయ కూలీలు, కార్మికులు అనేకమంది ఈ పోరాటంలో నైజాముకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. భూమికోసం ,భుక్తి కోసం జరిగిన పోరాటంలో 4500 మంది ప్రాణాలు అర్పించారు 3000 గ్రామాలు గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకొని గ్రామాలను కాపాడుకోవడం జరిగింది. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన కమ్యూనిస్టు యోధులు అని అన్నారు. అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో వలిగొండ ప్రాంతం కూడా ఒక పోరాట కేంద్రంగా పనిచేసిందని నైజాం నవాబు రజాకారులకు వ్యతిరేకంగా వేములకొండ, అరూరు, పులిగిల్ల, సుంకిశాల అనేక గ్రామాలలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన దాంట్లో కమ్యూనిస్టు పార్టీ అగ్ర భాగాన నిలిచిందని అన్నారు ఆరూరు గ్రామంలో సాయిధ పోరాట స్తూపాల వద్ద నివాళులర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి, సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్, ఎలగందుల అంజయ్య, పోలేపాక యాదయ్య, బాలగోని సత్యనారాయణ, నరిగే యాదయ్య,బొడిగ సుదర్శన్,కట్ల యాదగిరి, ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు మారోజు నరసింహ చారి, సుద్దాల సాయికుమార్,మేడి దేవేందర్, బత్తుల బిక్షపతి, యాస జనార్దన్ రెడ్డి, సలిగంజి కృష్ణ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking