తెలంగాణకు సెప్టెంబర్‌–17 ముమ్మాటికి విద్రోహ దినమే

తెలంగాణకు సెప్టెంబర్‌–17 ముమ్మాటికి విద్రోహ దినమే

సెప్టెంబర్ 17 విముక్తి కాదు వంచనకు ప్రతీక

తెలంగాణ ఆత్మగౌరవానికి గాయపరిచిన చారిత్రక దినం

రాజకీయ ప్రయోజనాలకే వినియోగించిన విమోచన నినాదం

విమోచన కాకుండా విద్రోహం తెలంగాణ ప్రజల ఆవేదన

నాగారం, అక్షిత న్యూస్ :– తెలంగాణకు విలీనం, విమోచన దినం కాదని ముమ్మాటికి విద్రోహ దినమే అని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పోలేబోయిన కిరణ్‌ కుమార్ అన్నారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆద్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని కామ్రేడ్‌ యానాల వీరారెడ్డి స్థూపం వద్ద తెలంగాణకు సెప్టెంబర్‌ 17 విద్రోహ దినంగా పాటిస్తూ నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1948 నుంచి 1952 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారత విప్లవానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతంగా పోరాటాన్ని వివిధ రాజకీయ పార్టీలు తమ స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంపై ఉక్కు పాదం మోపి, ప్రజల హక్కులను, స్వేచ్ఛను హరించి వేసి, అనేక మందిని పొట్టన పెట్టుకుందన్నారు. నేడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం అంటూ వాస్తవాలను దాస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూములను పంచారని, వెట్టిచాకిరి, పీడన, వివక్షత, అణిచివేతలను రద్దు జరిగిందన్నారు. యూనియన్‌ సైన్యాలు వచ్చి దాడులు, హత్యలు చేసి ప్రజలు సాధించుకున్న వాటిని తిరిగి ప్రజలు కోల్పోయే విధంగా అణచివేశారని అన్నారు. అందుకే సెప్టెంబర్‌–17 తెలంగాణ విద్రోహ దినమే అన్నారు. నాడు సాయుధ పోరాటంలో దున్నేవానికే భూమి కావాలని, దోపిడీ వ్యవస్థ రద్దు కావాలని కమ్యూనిస్టు పార్టీ నినదించిందని ఆ పోరాట వెలుగులో ప్రజలు ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కమిటి సభ్యులు తడకమల్ల సంజీవ్, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు డి.కొత్తపల్లి మాజీ సర్పంచ్ యానాల సుధాకర్‌రెడ్డి, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కాసం వీరయ్య, నాతి ఉప్పలయ్య, గాడుదుల శ్రీను, పల్లెర్ల సోమయ్య, దీగోజు ఉపేందర్, భూషబోయిన రమేష్, నాతి బాలరాజు, తంగెళ్లపల్లి విక్రమ్, వేముల గణేష్, పల్లెర్ల మల్లేష్, బచ్చు విజయ్, కాత నరేష్‌ , ఏనుగుల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking