ఆదర్శ పాఠశాల అభివృద్ధి కల్పనకు కృషి చేస్తాం

ఆదర్శ పాఠశాల అభివృద్ధి కల్పనకు కృషి చేస్తాం

* మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

* భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

* మెనూ ప్రకారం భోజనం అందించాలి

వలిగొండ/అక్షిత న్యూస్:

ఆదర్శ పాఠశాల విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరించి మెరుగైన మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ ను శుక్రవారం రోజున ఆయన తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో ఉన్న పలు ప్రధాన సమస్యలను విద్యార్థులు ఆయనకు వివరించారు. అనంతరం కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం రవాణా సౌకర్యం కల్పించాలని కోరగా డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి ఉదయం సాయంత్రం బస్సు నడపాలని ఆయన కోరారు.

అంతేకాకుండా పాఠశాల కి అవసరమైన వంటశాల, కంప్యూటర్ గదికి రక్షణ కిటికీలు అలాగే విద్యార్థులకు టాయిలెట్స్ త్వరలోనే కట్టించి అందజేస్తామని వారన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కృష్ణారెడ్డి, ఎమ్మార్వో దశరథ, ఎండిఓ జలంధర్ రెడ్డి, ప్రిన్సిపల్ రయి సున్నిసా బేగం, పలువురు నాయకులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking