ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల మండలంలోని నాగపురి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలికట్టే ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, నాగపురి ఉన్నత పాఠశాల పరిధిలోని ఎంపీపీఎస్, నాగపురి ఎస్సీ కాలనీ, శభాష్ గూడెం, గండికుంట పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అందె విజయ్ కుమార్ తో పాటు మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఎస్ కృష్ణమూర్తి, భవాని, సంతోష్ లను, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం హెచ్ఎం అయిలయ్య మాట్లాడుతూ అవార్డులు ఉద్యోగులకు మరింత బాధ్యతలు పెంచుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ, మనోజ్, ప్రకాష్ రెడ్డి,మాధవి, యాదగిరి,స్వర్ణకుమార్, రాజేశ్వరి, శ్రీధర్,శ్రీనివాసరావు, ధనలక్ష్మి, మల్లికార్జున రెడ్డి, బాపురెడ్డి, సంపత్, శ్వేత, రామాంజనేయులు, అంబిక,ఉమర్, స్వామిలు పాల్గొన్నారు.