గ్రో హెయిర్, గ్లోస్కిన్
తొలి వసంత వేడుకలు
బిఆర్ఎస్ ఎల్పీ విప్,
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
మేడ్చల్, అక్షిత బ్యూరో:
కొంపల్లి పురపాలక పరిధిలోని అడ్వాన్స్ గ్రో హెయిర్, గ్లోస్కిన్ వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన మొదటి మూడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 104 బ్రాంచీలు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా 11 బ్యాంకులను ఏర్పాటు చేసుకుని వేలాదిమంది కస్టమర్లను సంపాదించుకొని మంచి ట్రీట్మెంట్ ను అందజేస్తూ ఆదరాభిమానాలు చూరగొన్న అడ్వాన్స్ గ్రో హెయిర్, గ్లోస్కిన్ క్లినిక్ మరింత అభివృద్ధి చెందాలన్నారు.

రానున్న రోజుల్లో 200 బ్రాంచ్ ఏర్పాటు వైపుగా ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శిరీష ప్రవీణ్, పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, నాయకులు భూలక్ష్మణ్, కిట్టు, అడ్వాన్స్డ్ గ్రోహేయిర్ & గ్లోస్కిన్ క్లినిక్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ వెల్ జే, ఫ్రాంచైజ్ భాగస్వామ్యులు హరిన్యా గౌని, శ్రీధర్ పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.