మెనూ పాటించట్లే మండిపడ్డ కలెక్టర్

మెనూ పాటించట్లే
మండిపడ్డ కలెక్టర్

ఎస్సీ బాలుర వసతి
గృహంలో రిపేర్లకు
అంచనాలు రూపొందించాలి

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

బాలానగర్ మండల కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహ భవనంలో రిపేర్లు నిర్వహించుటకు అంచనాలు రూపొందించాలని పంచాయతీ రాజ్ ఈఈని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బాలానగర్ మండలం లో ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,తెలంగాణ బాలికల గురుకుల, జూనియర్ కళాశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహం ను అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాలు కురిసినప్పుడు బయట పొలాలు, రోడ్డు పై నుండి వరద నీరు వసతి గృహంలోని కిచెన్,  వాష్ రూమ్ చుట్టుపక్కల వచ్చిన చేరి బురదతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం గమనించివారు. వసతి గృహంలో బయట నుండి వచ్చే వరద నీరు పోయేందుకు డ్రైనేజీ పైప్ లైన్ రోడ్డు వెంబడి ఉన్న కచ్చా డ్రైన్ కు కలపాలని ఇందుకు అంచనాలు వేయాలని పంచాయతీ రాజ్ ఈ ఈ ని ఆదేశించారు. అదేవిధంగా వసతి గృహం బయట పొలంలో ఉన్న బావి నుండి నీరు వస్తున్నందున బావి యజమానితో మాట్లాడి పూడ్చి వేసేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు.వసతి గృహం ఆవరణలో వర్షం నీరు నిలవకుండా కాంక్రీట్, వసతి గృహ గదుల్లో ఫ్లోరింగ్, కిటికీలు, తలుపులు, కలరింగ్,ఇతర రిపేర్లకు అంచానాలు రూపొందించి నిధుల మంజూరుకు సమర్పించాలని పంచాయతీ రాజ్ ఈఈని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో అక్షయపాత్ర ద్వారా వచ్చిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో భోజనం ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో గత సంవత్సరం వచ్చిన పదవ తరగతి ఫలితాలను గురించి కలెక్టర్ పాఠశాల హెడ్ మాస్టర్ ను అడిగారు.గత సంవత్సరం 91 శాతం ఉత్తీర్ణులు అయ్యారని కలెక్టర్ కు వివరించారు.ఈ విద్యా సంవత్సరంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులను కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద డైనింగ్ హాల్ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది.


డైనింగ్ హాల్ షెడ్ కు వెంటనే ఎస్టిమేట్స్ రూపొందించాలని పంచాయతీ రాజ్ ఈ ఈ ని ఆదేశించారు. అనంతరం తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు.వంటగదిలోకి వెళ్లి విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం పరిశీలించారు.
ఈరోజు మెనూ ఏంటి ఏమీ వండినారు అని అడిగారు. క్యారెట్ కు బదులు టమాటా వండినట్లు తెలిపారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు.తహశీల్దార్, ఎంపిడిఓలు పర్యవేక్షణ చేయాలని సూచించారు స్టోర్ రూం, కూరగాయలు భద్రపరిచే రూంను సందర్శించారు. మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని, తాజా కూరగాయలు, ఆకుకూరలు , ఎప్పటికప్పుడు సరుకులు అందించేలా కాంట్రాక్టర్ కు సూచించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ తో పాటు పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సునీత, తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి ఎంపిడిఓ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking