దరఖాస్తులకు ఆహ్వానo
ఔట్ సోర్సింగ్
పద్ధతిపై ఏపీఆర్ఓ
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై సహాయ పౌర సంబంధాల అధికారి, పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులలో మార్చి 31, 2026 వరకు పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ,అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సహాయ పౌర సంబంధాల అధికారి, ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్) అవుట్ సోర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఏపీఆర్ఓ పోస్ట్ కు దరఖాస్తు చేసే వారికి జర్నలిజం/పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు, ఏదైనా సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, డిజిటల్ మీడియా,ఏ ఐ టూల్స్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్) గా పనిచేసేందుకు ఏదైనా సబ్జెక్టులో బ్యాచ్ లర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు శిక్షణ సంస్థ సినీ -ఫోటోగ్రఫీ లో జారీచేసిన డిప్లమా లేదా గుర్తించబడిన సమాన అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆమె తెలిపారు. ఏపీఆర్ఓ పోస్ట్ కు నెలకు36,750 /-రూపాయలు ,పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్) పోస్ట్ కు నెలకు 27,130/- రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
పై పోస్టులలో మార్చి 31, 2026 వరకు పనిచేసేందుకు ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 25 లోగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పూర్తి వివరాలతో అన్ని ధ్రువపత్రాలను జతచేస్తూ వారి దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరగదని ఆమె స్పష్టం చేశారు. జిల్లాస్థాయి ఎంపిక కమిటీ ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుందని ఆమె వెల్లడించారు.