చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాన్ని సాధించాలి
* జిల్లాకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి
* ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
* డ్రగ్స్ మహమ్మారికి దూరం ఉండాలి
వలిగొండ/ అక్షిత న్యూస్:
విద్యతోపాటు క్రీడల్లోనూ మంచి ప్రతిభ కనబరిచి నైపుణ్యాన్ని సాధించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 జిల్లాస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ పసల జ్యోతి విజయానంద్ సహకారం అందించారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం మాట్లాడుతూ డ్రగ్స్ వంటి మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హెచ్చరించారు. యాదాద్రి జిల్లాలో పలువురు పద్మశ్రీని పొందారని చదువులోనూ, క్రీడల్లోను మంచి పేరు ప్రతిష్టలు సాధించి యాదాద్రి జిల్లా ఘనతను చాటాలని తెలిపారు.

క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చిన్నతనం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు.
*సీఎం రిలీఫ్ ఫండ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ*
అనంతరం వలిగొండ మండలంలోని రైతు వేదికలలో గ్రామాలకు చెందిన 50 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 94 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి 34, 71,500 రూపాయల చెక్కులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఎమ్మార్వో దశరథ ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్సై యుగేందర్ గౌడ్, ఎంఈఓ భాస్కర్ మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి, కంకల కిష్టయ్య, కాసుల వెంకన్న, బద్దం సంజీవరెడ్డి, గరిసె రవి, బెలిదే నాగేశ్వర్,ఐటి పాముల రవీంద్ర, కొండూరు భాస్కర్, చిలుగూరు సత్తిరెడ్డి, నోముల మల్లేష్, పాలకూర్ల వెంకటేశం, కొండూరు సాయి,ఉలిపె మల్లేశం, బత్తిని సహదేవ్,మైసోల్ల ప్రవీణ్, బుగ్గ మనోజ్, ఎమ్మె లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.